KTR Case: క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించనుంది..! 5 d ago
TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించనుంది. రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ కౌంటర్ దాఖలు చేశారు. అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ వేసింది. నేటితో కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల గడువు ముగియనున్నది.